- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akkineni Amala: ‘అక్కడ తొలిసారిగా కావేరీ ఫ్లాగ్‌షిప్ బోటిక్‌ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది’: అమల
అక్కినేని నాగార్జున సతీమణి అమల (Akkineni Amala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున సతీమణి అమల (Akkineni Amala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె రాజేందర్ (Rajender) దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ సినిమాలో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే భారీ హిట్ కొట్టడంతో అమలకు పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. తర్వాత కమల్ హాసన్ కీలక పాత్రలో వచ్చిన నిశ్శబ్ద మూవీ పుష్ఫక విమానంలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
తర్వాత అమల మలయాళ సినిమా అయిన ఉలడక్కమ్(Uladakkam)లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల వద్ద నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి అమల ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. నృత్యం నేర్చుకుంటోన్న సమయంలో ఈమె తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడింది. దీంతో అమలకు వైశాలి చిత్రంలో అవకాశం ఇచ్చాడు.
ఇక తెలుగు లో డి. రామానాయుడు (D. Ramanaidu)నిర్మించిన చినబాబు (Chinababu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కథానాయకుడు నాగార్జుననే. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. 1992 లో నాగార్జున, అమల వివాహం చేసుకున్నారు. తర్వాత సినిమాలకు దూరంగా కొన్ని సినిమాల్లో అమ్మ పాత్రలో కనిపించింది అంతే. 012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life is beautiful) అనే తెలుగు సినిమాతో తిరిగి వచ్చింది.
అయితే అమల తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘హైదరాబాద్‌లో తొలిసారిగా కావేరీ ఫ్లాగ్‌షిప్ బోటిక్(Kaveri Flagship Boutique)ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది. నేను స్థిరమైన దుస్తులు కోసం లోతుగా శ్రద్ధ వహిస్తాను అండ్ ఇది లేబుల్ ఒక బెంచ్‌మార్క్. స్టోర్ వైబ్ అండ్ దాని వెనుక ఉన్న యువ మహిళా వ్యాపారవేత్తల ఉత్సాహం నచ్చింది. కావేరీ.. అలాగే టీమ్‌కి శుభాకాంక్షలు’’ అంటూ అమల రాసుకొచ్చి.. ఫొటోలు కూడా పంచుకుంది. ప్రస్తుతం అమల పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






