కాబోయే భార్యతో కనిపించిన అక్కినేని అఖిల్… పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టేనా! (వీడియో)

by Mallepaka Hamsa |

అక్కినేని నాగార్జున(Nagarjuna) తనయుడు అఖిల్(Akhil) గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ కాలేకపోయాడు.

కాబోయే భార్యతో కనిపించిన అక్కినేని అఖిల్… పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టేనా! (వీడియో)
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Nagarjuna) తనయుడు అఖిల్(Akhil) గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ కాలేకపోయాడు. 2023లో ఆయన చివరి సారిగా ‘ఏజెంట్’ మూవీలో కనిపించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున అఖిల్, జైనబ్‌(Zainab)ల నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిపించారు. ట్విట్టర్ వేదికగా ఫొటో షేర్ చేసి అధికారిక ప్రకటన విడుదల చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక త్వరలో పెళ్లి చేసుకుంటాడనుకుంటే.. అఖిల్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం పెళ్లి డేట్ ఎప్పుడెప్పుడు చెప్తాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. అఖిల్, తన కాబోయే భార్య జైనబ్‌లో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇక కారు దిగిన ఈ జంట ఒకరి చేతులు ఒకరు పట్టుకుని లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోను చూసిన వారంతా.. వీరి వివాహానికి డేట్ ఫిక్స్ అయింది కావచ్చు పెళ్లి పనుల కోసమే ఎక్కడికో వెళ్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ విధంగా హింట్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ అఖిల్ పెళ్లి డేట్‌పై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా, అఖిల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ (Lenin)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Next Story