- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
ఆ స్టార్ హీరో కొడుకుతో అక్కినేని అఖిల్.. ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు భయ్యో అంటూ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) వారసుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో సందీప్ కిషన్(Sundeep Kishan)తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో సంజయ్‌తో పాటు అక్కినేని అందగాడు అఖిల్(Akhil) కూడా కనిపించారు. దాంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు సంజయ్ అఖిల్‌తో సినిమా చేస్తున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. కాగా అఖిల్ చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’(Lenin) అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో ఆయన మాస్ అవతార్‌లో కనిపించనున్నట్లు తెలిసిపోయింది. ఇక ఈ మూవీలో అయ్యగారికి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree leela) నటిస్తుంది.