లెనిన్ కోసం అఖిల్ ప్రత్యేక ప్లాన్.. ఇప్పటి నుంచే కసరత్తులు

by Pulgam srinivas |

‘లెనిన్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అఖిల్ ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

లెనిన్ కోసం అఖిల్ ప్రత్యేక ప్లాన్.. ఇప్పటి నుంచే కసరత్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో సినిమాను ఎంత బాగా తీశామనే దానికంటే ఎంత బాగా ప్రమోట్ చేశామనే విషయమే కీలకంగా మారింది. దీంతో మేకర్స్ సినిమాల నిర్మాణంపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో, అంతకుమించిన స్థాయిలో వాటి ప్రమోషన్లపైనా దృష్టి పెడుతున్నారు. ఇక అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో అఖిల్ కూడా ప్రత్యేకంగా ప్రమోషన్ల కోసం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

త్వరలోనే వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయనతో పాటు చిత్ర బృందం కూడా ప్రమోషన్లలో యాక్టివ్‌గా పాల్గొననుంది. ఏదేమైనా ఈ సినిమాతో అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Next Story