Akhil: డాగ్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది.. కానీ తర్వాత అలాంటి అనుభవం ఎదురైంది

by Pulgam srinivas |

'లెనిన్' సినిమాలో కనిపించే కుక్క షూటింగ్ మొదటి రోజు కాస్త ఇబ్బంది పెట్టిందని అఖిల్ చెప్పుకొచ్చాడు.

Akhil: డాగ్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది.. కానీ తర్వాత అలాంటి అనుభవం ఎదురైంది
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అఖిల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ చిత్రాన్ని జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో, 'లెనిన్' చిత్రంలో మీతో పాటు ఓ కుక్క కూడా కీలక పాత్రలో కనిపిస్తుందని, దాని వల్ల షూటింగ్‌కు అంతరాయం ఏర్పడిందని వినిపిస్తోంది. అది నిజమేనా? అని ప్రశ్నించగా అఖిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అఖిల్ మాట్లాడుతూ.. "మా సినిమాలో ఒక కుక్కకు చాలా కీలకమైన పాత్ర ఉంది. సినిమా మొత్తం అది నాతోనే ప్రయాణిస్తుంది.

చివరకు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నాతో పాటు కనిపిస్తుంది. షూటింగ్‌కు అది ఒక్కరోజు మాత్రమే కాస్త ఇబ్బంది కలిగించింది. మొదటి రోజు షాట్ తీస్తుండగా 'యాక్షన్' అనగానే అది పరుగెత్తి వెళ్లిపోయింది. దాంతో కొంతసేపు షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. చాలా ప్రశాంతంగా షూటింగ్ పూర్తైంది. సినిమాలో ఆ కుక్క నటనకు ప్రేక్షకులు తప్పకుండా ఫిదా అవుతారు" అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

Next Story