లెనిన్ కోసం అఖిల్ రిస్క్‌..ర‌వితేజ రేంజ్ లో హిట్ ప‌క్కానా?

by velandi.Saikiran |

లెనిన్ లో అఖిల్ పాత్రకు దృష్టిలోపం ఉంటుందట. ఈ నేపథ్యంలోనే కథ అద్భుతంగా సాగుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ న‌డుస్తోంది.

లెనిన్ కోసం అఖిల్ రిస్క్‌..ర‌వితేజ రేంజ్ లో హిట్ ప‌క్కానా?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. చాలా రోజుల నుంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న అక్కినేని అఖిల్, ఇప్పుడు లెనిన్ తో వస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో మొదట శ్రీ లీలను అనుకున్నారు. కానీ చివరకు భాగ్యశ్రీ ఫైనల్ అయింది.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో అక్కినేని అఖిల్ పాత్ర ఏంటి? అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో హీరో అఖిల్ పాత్రకు దృష్టిలోపం ఉంటుందట. ఈ నేపథ్యంలోనే కథ అద్భుతంగా సాగుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ న‌డుస్తోంది. రాజా ది గ్రేట్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో అఖిల్, భాగ్యశ్రీ మధ్య లవ్ సీన్స్ కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. దీంతో ఈసారి అఖిల్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు.

Next Story