- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల తర్వాత కూడా తన అన్న-వదినల ఫొటోలను భద్రంగా దాచుకున్న అఖిల్.. కారణం అదేనా
టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి మంచి పాపులారిటీ ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి మంచి పాపులారిటీ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు(Nageswara Rao) తర్వాత నాగార్జున(Nagarjuna), ఇప్పుడు నాగ చైతన్య(Naga Chaitanya), అఖిల్(Akhil) నటిస్తున్నారు. అయితే నాగ చైతన్య.. హీరోయిన్ సమంత(Samantha)తో ‘ఏమాయ చేశావే’(Yemaya Chesave) మూవీలో నటించి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే శోభితా ధూళిపాళ్ల(Shobitha Dhulipala)ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
సామ్- చై విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి సోషల్ మీడియాలోనూ వారి వారి ఫొటోస్‌ను డిలీట్ చేసుకున్నారు. కానీ అక్కినేని అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఇంకా సమంత ఫొటో అలానే ఉంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా విడాకుల తర్వాత తమ కుటుంబంలో నుంచి ఓ వ్యక్తి విడిపోయినప్పుడు కచ్చితంగా వారి పిక్స్‌ను డిలీట్ చేసేస్తారు. కానీ అఖిల్ మాత్రం తన ఫ్యామిలీతో, అన్న చైతు, మాజీ వదిన సమంతతో కలిసి దిగిన ఫొటోలు ఇంకా ఉంచుకున్నాడు. దీంతో సామ్‌తో అఖిల్ ఇంకా వదిన- మరిది రిలేషన్‌లోనే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






