- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 నుంచి బిగ్ అప్డేట్... ఇక తాండవమే
నందమూరి బాలయ్య, సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో లేటెస్ట్ మూవీ అఖండ 2. గతంలో

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య, సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో లేటెస్ట్ మూవీ అఖండ 2. గతంలో వచ్చిన అఖండ సినిమాకు... దీన్ని సీక్వెల్ గా తీస్తున్నారు బోయపాటి శ్రీను. శరా వేగంగా షూటింగ్ జరుపుకున్న అఖండ 2 సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. బాలయ్య తాండవం ప్రారంభం కాబోతుంది అంటూ... కీలక ప్రకటన చేసింది చిత్ర బృందం.
అంతేకాదు రేపు ఉదయం 10:54 గంటలకు.. క్రేజీ అప్డేట్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది. దీంతో రేపు ఉదయం అఖండ 2 సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అని... ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏదైతేనేం... బాలయ్య సినిమా నుంచి రేపు అప్డేట్ వస్తుందని ప్రకటన రావడంతో.... అభిమానులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా... ఈ సినిమా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట తెరకెక్కిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అలాగే.. ఈ సినిమాకు ఎప్పటిలాగే తమన్ ఊర మాస్ మ్యూజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ అలాగే అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల కంటే... ఒక మెట్టు ఎక్కువగానే అఖండ 2 సినిమా ఉంటుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.






