Akhanda 2: అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఎప్పుడంటే

by velandi.Saikiran |   (  Updated:2025-12-09 17:06:36  IST  )

డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.

Akhanda 2: అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఎప్పుడంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. అందరూ ఊహించినట్లుగానే బాలయ్య నటించిన అఖండ 2 సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. త్వరలోనే బుకింగ్స్ ఓపెన్ అవుతాయని వెల్లడించింది చిత్ర బృందం. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ తో ఉన్న అఖండ 2 సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

ఈ ప్రకటనతో నందమూరి బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రేపు చిత్ర బృందం ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్ కూడా పెట్ట‌నుంద‌ట‌. ప్రెస్ మీట్ లో రిలీజ్ వాయిదా ప‌డ‌టం, కొత్త రిలీజ్ తేదీల‌పై మాట్లాడున్నార‌ట‌. ఈ ప్రెస్ మీట్ కు బాల‌య్య కూడా వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని టాక్‌. కాగా కొన్ని ఫైనాన్షియ‌ల్ కార‌ణాల వ‌ల్ల‌, న‌వంబ‌ర్ 5 తేదీన రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Next Story