- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2 టికెట్ల ధరలు పెంపు... సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. లేకపోతే, ఐ-బొమ్మ రవి లాంటి వాళ్లను అరెస్టు చేసే నైతిక

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను పెంచేందుకు పర్మిషన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడంపై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచడానికి తీవ్రంగా ఖండించారు. వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్న పేరుతో, టికెట్ల ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని నిప్పులు చెరిగారు.
ఇలా టికెట్ల ధరలు క్రమక్రమంగా పెంచుకుంటూ పోతే, ఐ బొమ్మ రవి లాంటి పైరసీ చేసే వ్యక్తులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వస్తారని గుర్తు చేశారు. టికెట్ల ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు సినిమాలు చూడలేని పరిస్థితి, దీనివల్ల ఏర్పడుతోందని పేర్కొన్నారు. దీంతో జనాలు కూడా పైరసీకి అలవాటైపోతున్నారని, పైరసీ వెబ్ సైట్లు ఓపెన్ చేసి సినిమా చూస్తున్నారని తెలిపారు.
ఇకనైనా సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. లేకపోతే, ఐ-బొమ్మ రవి లాంటి వాళ్లను అరెస్టు చేసే నైతిక హక్కు కూడా ప్రభుత్వం కోల్పోతుందని చురకలు అంటించారు సీపీఐ నారాయణ. కాగా, డిసెంబర్ 4వ తేదీన రాత్రి 10 గంటల అఖండ 2 ప్రీమియర్ షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునేలా జీవో జారీ చేసింది కూటమి సర్కార్.






