హైదరాబాద్‌లో అఖండ 2 'తాండవం' ప్రీ-రిలీజ్ ఈవెంట్

by Malleboina Mahesh |

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సిని భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో అఖండ 2 తాండవం ప్రీ-రిలీజ్ ఈవెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సిని భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా దీనికి సీక్వెల్ గా అఖండ 2 (Akhanda 2) 'తాండవం' సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్. సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో సైతం అఖండ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'అఖండ' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'అఖండ 2' చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతోంది.

ఈ భారీ యాక్షన్ ఎపిక్ చిత్రం యొక్క 'గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్' ('Grand Pre-Release Event') ను నవంబర్ 28న హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టార్ హీరో బాలకృష్ణ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో, ఈ ఈవెంట్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తమన్ ఎస్. సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 'తాండవం' అనే స్లోగన్‌తో డిసెంబర్ 5, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Next Story