- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhanda-2: అఖండ-2 పై సాలిడ్ అప్‌డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అఖండ-2’

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అఖండ-2’ (Akhanda-2). 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్, బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించి షూటింగ్ ఇప్పటికే మొదలు పెట్టగా.. ప్రయాగ్ రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఇప్పుడు ఈ సినిమా షెడ్యూల్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ‘అఖండ-2’ సినిమా కీలక షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రీసెంట్‌గా జార్జియా(Georgia)కు వెళ్లింది. అక్కడ అద్భుతమైన ప్రదేశాల్లో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా బాలకృష్ణపై భారీ యాక్షన్ సీన్స్ (Action scenes) షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జార్జియాలో సినిమా షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారగా.. అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.






