- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2 లో స్పెషల్ సాంగ్.. ఇక ఫ్యాన్స్ కు పండగే ?
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ సినిమా అఖండ 2. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ అఖండ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు అఖండ సీక్వెల్ వస్తోంది. 2021 లో అఖండ మూవీ వచ్చి బంపర్ హిట్ కొట్టింది.
దీంతో ఇప్పుడు అఖండ 2 కూడా తీస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని కొంతమంది ప్రచారం చేశారు. ఇలాంటి నేపథ్యంలో.. అఖండ 2 మూవీ చిత్ర బృందం ప్రారంభించింది.
ఒక పాట మినహా అఖండ 2 షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు నిర్మాతలు. ప్రస్తుతం డబ్బింగ్ కూడా జరుగుతోందని.. ఆగస్టు 15వ తేదీ నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేస్తామని వివరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ఓవర్సీస్ కాపీ పంపించేస్తామని... వెల్లడించారు. అనుకున్నట్లే సెప్టెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నామని.. చిత్ర బృందం ప్రకటన చేసింది. అయితే ఆ ఒక్క పాట స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది.






