‘అఖండ 2’ ప్రీమియర్స్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

by Sujitha Rachapalli |

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ అంచనాలకు మించి ఉంటుందన్నారు ఆ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయన్న నిర్మాతలు.. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా అన్నారు. 2D, 3D

‘అఖండ 2’ ప్రీమియర్స్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
X

దిశ, సినిమా : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ అంచనాలకు మించి ఉంటుందన్నారు ఆ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయన్న నిర్మాతలు.. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా అన్నారు. 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ఇందుకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వరుస హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కుంభమేళాలో షూట్ చేశామని.. ఇందుకోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డాడని.. ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రీమియర్స్ కోసం ఆల్రెడీ పర్మిషన్ అడిగామని.. అనుతులు రాగానే ప్రీమియర్ డేట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. మూవీ టికెట్ రేట్స్ రీజనబుల్‌గానే పెడుతున్నామని స్పష్టం చేశారు.

Next Story