అఖండ 2 వాయిదా..ఆ రెండు సినిమాల‌కు బాగా క‌లిసొచ్చిందిగా!

by velandi.Saikiran |

రాజు వెడ్స్ రాంబాయి మూవీ కూడా నైజాంలో బాగా నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యే వరకు తమ

అఖండ 2 వాయిదా..ఆ రెండు సినిమాల‌కు బాగా క‌లిసొచ్చిందిగా!
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్ పడింది. కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల, డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన అఖండ 2 కాస్త వాయిదా పడింది. దీంతో బాలయ్య అభిమానులు చాలా డీలా పడిపోయారు. ఇలాంటి నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి, ఆంధ్రా కింగ్ తాలూకా రెండు సినిమాలకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయట. ముఖ్యంగా నవంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన ఆంధ్రా కింగ్ తాలూకాకు యూత్ ఎక్కువగా వెళుతున్నట్లు చెబుతున్నారు. దీంతో రెండో వారంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ గా మారింది.

ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలనం సృష్టించిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ కూడా నైజాంలో బాగా నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యే వరకు తమ సినిమా ఆడుతుందని చిత్ర బృందం కూడా అనుకుందట. కానీ సడన్ గా అఖండ 2 వాయిదా పడడంతో ఈ సినిమాకు జనాధారణ మరింత పెరుగుతోందట. ఫ్యామిలీ, యూత్, ప్రేమ జంటలు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట. కాగా అఖండ 2 ఈ నెల 12వ తేదీ లేదా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుందట. అప్పటి వరకు ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ ఏమాత్రం తగ్గబోవని అంచనా వేస్తున్నారు.

Next Story