- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాలు వాయిదా ?
డిసెంబర్ 12నే అఖండ 2 రిలీజ్ కానుందని వార్తలు రావడంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు వణికిపోతున్నారు. నిజం

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమా మొన్న డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు మార్గం సుగమం అయిందని చెబుతున్నారు. ఫైనాన్షియల్ సమస్యలు మొత్తం తీరిపోయాయట. దీంతో డిసెంబర్ 12వ తేదీన అంటే మరో మూడు రోజుల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతోందట.
అయితే నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయితే, మరో రెండు చిన్న సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలపొందని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతుందని ముందే ప్రకటించడంతో 'మోగ్లీ 2025' అలాగే ఈషా సినిమాలు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేసేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నాయి.
ఈ మేరకు ప్రమోషన్సు కూడా చేసుకుంటున్నాయి. అంతా బాగానే ఉందని అనుకునే సమయంలో అఖండ 2 సినిమా మోగ్లీ 2025, ఈషా సినిమాలకు విలన్ గా మారాయి. డిసెంబర్ 12నే అఖండ 2 రిలీజ్ కానుందని వార్తలు రావడంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు వణికిపోతున్నారు. నిజంగా అఖండ 2 రిలీజ్ అయితే, కొత్త డేట్స్ ప్రకటించాలని అనుకుంటున్నారట.






