- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 సినిమాలపై అఖండ 2 ఎఫెక్ట్...? దర్శకుడు ఎమోషనల్ పోస్ట్
అఖండ 2 సినిమా 12వ తేదీన రాబోతుందన్న వార్త బయటకు రావడంతో చిన్న సినిమాల నిర్మాతలు వణికిపోతున్నారు

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ పంచాయతీ చివరి దశలో ఉందట. అది తెగితే ప్రకటన అధికారికంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, అనౌన్స్మెంట్ వస్తే మాత్రం డిసెంబర్ 12వ తేదీన అఖండ 2 సినిమా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే అదనపు రేట్ల కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లీ అఖండ 2 టీం ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టిందట.
అయితే, అఖండ 2 సినిమా 12వ తేదీన రాబోతుందన్న వార్త బయటకు రావడంతో చిన్న సినిమాల నిర్మాతలు వణికిపోతున్నారు. ఈ వారాంతంలో 14 కొత్త సినిమాలతో పాటు మూడు రీ-రిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారిందని చర్చ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే ప్రమోషన్లు పూర్తి చేసుకున్న సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. బాలయ్య అఖండ 2 రిలీజ్ అయితే మాత్రం ఈ 17 సినిమాలకు దెబ్బ అని అంటున్నారు. ఇక అటు మోగ్లీ 2025 సినిమా కూడా దాదాపు రిలీజ్ వాయిదా పడినట్లేనని అంటున్నారు. అంతేకాదు, దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర పోస్ట్ కూడా పెట్టారు.
అంతా సెట్ అయిందనుకున్న సమయంలో మోగ్లీ 2025 సినిమా విడుదలకు బ్యాడ్ లక్ ఎదురైనట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకున్న కల రోజురోజుకు కష్టమవుతోందని ఎమోషనల్ అయ్యారు. వెండితెరకు నేను ఇష్టం లేదేమో.. అంకిత భావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి లాంటి వారి కోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నట్లు వివరించారు. కాగా మోగ్లీ 2025 సినిమా డిసెంబర్ 12 కు బదులు 20, లేదా 24 తేదీల్లో రావచ్చు అని చెబుతున్నారు. అటు ఈషా డిసెంబర్ 12వ తేదీన విడుదల కాకుండా డిసెంబర్ 13, 19 లేదా 25వ తేదీకి వాయిదా పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






