అల్లు అర్జున్ పోస్ట‌ర్‌ కాపీ చేసిన CSK బౌలర్

by velandi.Saikiran |   (  Updated:2026-04-24 05:32:13  IST  )

అల్లు అర్జున్ సినిమాను కాపీ చేశాడు CSK బౌలర్ అకేల్ హోసేన్.

అల్లు అర్జున్ పోస్ట‌ర్‌ కాపీ చేసిన CSK బౌలర్
X

దిశ‌, వెబ్ డెస్క్: అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రాకా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల మొదటి వారంలోనే ప్రకటించారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్ అని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తోన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా పోస్టర్ ను తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అకేల్ హోసేన్ కాపీ చేశాడు.

రాకా సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు.. ఇందులో అల్లు అర్జున్ లుక్ చాలా భయంకరంగా ఉంది. చేతిని అడ్డం పెట్టుకొని, ఊర మాస్ గా అల్లు అర్జున్ కనిపించాడు. అయితే నిన్న ముంబై ఇండియన్స్ పై నాలుగు వికెట్లు పడగొట్టిన అకేల్ హోసేన్ కూడా... అచ్చం అల్లు అర్జున్ లాగా ముఖానికి చేయి అడ్డం పెట్టుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అల్లు అర్జున్ ను ఐపీఎల్ క్రికెటర్లు కూడా ఫాలో కావాల్సిందేనని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story