అజిత్ కుమార్ కీలక నిర్ణయం.. సినిమాలకు దూరం ఉండాలనుకుంటున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ వైపు కార్ రేసులలో పాల్గొంటూనే వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

అజిత్ కుమార్ కీలక నిర్ణయం.. సినిమాలకు దూరం ఉండాలనుకుంటున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ వైపు కార్ రేసులలో పాల్గొంటూనే వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆయన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ సాధించలేకపోయారు. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల పద్మభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అయితే గత కొద్ది కాలం అజిత్ కుమార్ ఇండస్ట్రీకి దూరం కానున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ కుమార్ రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నాకు రేసింగ్ అంటే ఇష్టం కాబట్టి దానికోసం ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. స్విమ్మింగ్, సైక్లింగ్‌తో పాటు ఇతర వర్కౌట్లు, డైట్ చేసి ఎనిమిది నెలల్లోనే ఏకంగా 42 కిలోల బరువు తగ్గాను. రేసింగ్, సినిమా ఓకే సమయంలో ఉండే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నాను. దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు చూడాల్సి వచ్చింది. అందుకే నేను ఓ కీలక నిర్ణయం తీసుకున్నాను. రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. రేసింగ్ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. దీంతో ఇక సినిమాల్లో యాక్షన్ సీన్స్ వల్ల కూడా చాలా సర్జరీలు చేయించుకున్నా.

అలా అని రేసింగ్, మూవీస్ వదిలేయలేను. నా దృష్టిలో అవి రెండూ ఒకటే’’అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే అజిత్ కుమార్ తన తదుపరి సినిమా గురించి కూడా బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆయన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ‘ఏకే-64’వర్కింగ్ టైటిల్ రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్స్‌లో రాబోతున్నట్లు ప్రకటించడంతో అజిత్ కుమార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Next Story