- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
54ఏళ్ల తమిళ్ హీరోతో శ్రీలీల రొమాన్స్.. ఏంటి ఈ ఖర్మ..
‘పరాశక్తి’ మూవీతో కోలీవుడ్‌కు ఎంటర్ అయిన శ్రీలీల.. ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. డ్యాన్స్, గ్లామర్ పరంగా మాత్రమే కాదు నటనతోనూ ఈ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

X
దిశ, సినిమా : ‘పరాశక్తి’ మూవీతో కోలీవుడ్‌కు ఎంటర్ అయిన శ్రీలీల.. ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. డ్యాన్స్, గ్లామర్ పరంగా మాత్రమే కాదు నటనతోనూ ఈ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు కూడా సంతృప్తిని ఇచ్చిందని చెప్పింది. ఇక ఇప్పుడు రెండో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల హీరో అజిత్ కుమార్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాక్. కాగా ఈ మధ్య మలేషియాలో అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో డైరెక్టర్‌తో కలిసి శ్రీలీల కనిపించడం.. ఈ న్యూస్‌కు బలం చేకూర్చింది. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుండగా.. సమ్మర్‌లో విడుదల కానుంది. ఇక ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
Read More : అప్పుడు రాలేదన్నారు.. ఇప్పుడు ఛాన్సుల్లేవ్ అంటున్నారు
Next Story






