- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ajith Kumar: అల్లు అర్జున్ పాటకు మాసు స్టెప్పులు వేసిన స్టార్ హీరో అజిత్..? వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో అజిత్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రాలతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో అజిత్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రీసెంట్‌గా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహానికి హీరో అజిత్ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు.
ఈ వేడుకలో అజిత్ బ్లాక్ కోట్ సూట్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. అయితే తాజాగా ఈ పెళ్లిలో తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు అజిత్. ‘పుష్ప ది రైజ్’ సినిమాలో అల్లు అర్జున్, సమంత కలిసి చిందులేసిన ఊ అంటావా మావ ఊహు అంటావా అనే సాంగ్‌కు అజిత్ మాస్ స్టెప్పులు వేసి ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కొంతమంది అతను అజిత్ కాదని అంటుంటే మరికొంత మంది ఈ ఏజ్‌లో కూడా సూపర్‌గా డ్యాన్స్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఉన్నది హీరో అజితో కాదో తెలియాలంటే అతను ఈ వీడియో పై స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.






