అజిత్ నిజంగానే రియ‌ల్ హీరో..మాట‌లు రాని అభిమానితో

by velandi.Saikiran |

మాటలు రావు అంటూ అజిత్ దగ్గర ఆ అభిమాని చెప్పుకున్నాడు. దీంతో వెంటనే ఆ మొబైల్ తీసుకుని, స్వయంగా ఆ అభిమానితో సెల్ఫీ దిగాడు

అజిత్ నిజంగానే రియ‌ల్ హీరో..మాట‌లు రాని అభిమానితో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాది స్టార్ హీరో అజిత్ కుమార్ ( Ajith kumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అతనికి మంచి పాపులారిటీ ఉంది. ఈ సినిమా చేసినా, ప్రాణం పెట్టి తీస్తాడు. అజిత్ సినిమా రిలీజ్ అయింది అంటే చాలు, ఆ రోజు పండగే. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే అలాంటి హీరో అజిత్ తాజాగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తిరుమల శ్రీవారిని సాధారణ భక్తుడి లాగానే దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన సింపుల్ లుక్ లో కనిపించారు. ఇక హీరో అజిత్ కనిపించగానే అక్కడ ఉన్న అభిమానులు అందరూ ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఈ సందర్భంగా ఓ మూగ అభిమాని, అజిత్ తో సెల్ఫీ కోసం ట్రై చేశాడు. తనకు చెవులు వినిపించవు, మాటలు రావు అంటూ అజిత్ దగ్గర ఆ అభిమాని చెప్పుకున్నాడు. దీంతో వెంటనే ఆ మొబైల్ తీసుకుని, స్వయంగా ఆ అభిమానితో సెల్ఫీ దిగాడు హీరో అజిత్. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రియల్ హీరో అని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటోడు ఉండాలి రా అంటున్నారు. క్లిక్

Next Story