- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ రిలీజ్.. యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టేశాడుగా
స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అర్జున్ దాస్, రాహుల్ దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన అజిత్ ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరో అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ''AK ఒక రెడ్ డ్రాగన్.. తన రూల్స్ ను తానే బ్రేక్ చేసుకున్నాడంటే అర్థం.. '' అంటూ అజిత్ క్యారక్టర్‌కు ఎలివేషన్ ఇచ్చే డైలాగ్‌తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఒక క్రేజీ వైల్డ్ యాక్షన్ రైడ్‌లా సాగింది.
తలా ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. అజిత్‌ను ఈ సినిమాలో రకరకాల గెటప్స్‌లో, డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేశారు. ఆయన వింటేజ్ లుక్స్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. ఒక షాట్‌లో 'బిల్లా'ను గుర్తు చేయడంతో పాటుగా.. క్లీన్ షేవ్ తోనూ కనిపించి ఆకట్టుకున్నారు. అలానే కొన్ని చోట్ల బక్కగా.. మరికొన్ని చోట్ల లావుగా కనిపించి పాత్రలో వేరియేషన్ చూపించారు. ఫైనల్‌గా ''మనం ఎంత మంచి వాళ్ళమైనా.. ఈ ప్రపంచం మనల్ని బ్యాడ్, అగ్లీగా మారుస్తుంది'' అనే డైలాగ్.. చివర్లో ''మై డార్లింగ్స్.. మీ అందరినీ మిస్ అవుతున్నా'' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్‌ను చూసేయండి.






