- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ajay Ghosh: అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరిలో ఉన్న సిమిలారిటీ అదే
అజయ్ ఘోష్ మాట్లాడుతూ… అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సినిమా కోసం ఎంత కష్టపడడానికి అయినా సిద్ధంగా ఉంటారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో అద్భుతమైన గుర్తింపు సంపాదించిన నటుల్లో అజయ్ ఘోష్ ఒకరు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజయ్ ఘోష్ మాట్లాడుతూ, తాను పుష్ప సినిమాలో నటించినప్పుడు అల్లు అర్జున్ ఎంతగా కష్టపడ్డారో దగ్గరగా చూసినట్టు చెప్పారు. ఒక సన్నివేశం పర్ఫెక్ట్‌గా రావడానికి ఆయన ఎంతైనా శ్రమించేవారని, అవసరమైతే బురదలో కూడా పనిచేయడానికి వెనుకాడరని వెల్లడించారు.
అలాగే అదే తత్వం రామ్ చరణ్‌లో కూడా కనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో తాను కూడా పనిచేశానని, అందులో కుస్తీ పోటీ సన్నివేశాల్లో చరణ్ చూపిన అంకితభావం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. “ఇంత పెద్ద స్టార్ అయినా, చివరికి వారు కూడా కష్టపడే నటులే. కష్టమే వారిని ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనతో ఎంతో స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా వ్యవహరిస్తారని అజయ్ ఘోష్ తెలిపారు.






