- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ajay Devgan: గోల్‌మాల్ మళ్ళీ వస్తున్నాడు.. మ్యాడ్ అండ్ మస్తీకి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అజయ్ దేవగన్ (Ajay Devgan)..

దిశ, సినిమా: డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అజయ్ దేవగన్ (Ajay Devgan).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా మరో అప్డేట్ వచ్చింది. అజయ్ దేవగన్ నటించిన ‘గోల్‌మాల్’ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోల్‌మాల్ ఫన్ అన్‌లిమిటెడ్ అనే టైటిల్‌తో 2006లో రిలీజైన ఈ మూవీ అత్యధిక ప్రేక్షకాదరణ పొందగా.. ఈ ఫ్రాంచైజీలో గోల్‌మాల్ రిటర్న్స్ (2008), గోల్‌మాల్ 3 (2010) అండ్ గోల్‌మాల్ ఎగైన్ (2017) సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 5వ భాగానికి సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘గోల్‌మాల్ 5వ భాగం కోసం అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి తిరిలి కలుస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కామెడీ ఫ్రాంచైజీ 2026లో రిలీజ్ కాబోతుంది.. మ్యాడ్ అండ్ మస్తీకి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా. ఈ చిత్రాలన్నీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.






