అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం-3’ సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

దృశ్యం3 షూటింగ్ ముగిసింది. గత కొన్ని నెలలుగా ఈ చిత్రమే మా ప్రపంచం.

అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం-3’ సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ.. రిమేక్‌గా ఇతర భాషల్లోనూ వచ్చి అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఇక ఇప్పటికే రెండు భాగాలు పూర్తి కాగా.. అన్ని భాషల్లో సక్సెస్ సాధించాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దృశ్యం-3’ మలయాళ వెర్షన్ మే 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. దీనినే తెలుగులో డబ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. హిందీ వెర్షన్‌లో స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ మరోసారి ‘విజయ్ సాల్గావ్‌కర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్‌తో పాటు టబు, శ్రియా శరన్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా దర్శకుడు అభిషేక్ పాఠక్ సోషల్ మీడియా వేదికగా సినిమా షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘దృశ్యం3 షూటింగ్ ముగిసింది. గత కొన్ని నెలలుగా ఈ చిత్రమే మా ప్రపంచం. సన్నివేశాల కోసం ప్రయత్నిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, నవ్వులు పంచుకుంటూ, సవాళ్లను అధిగమిస్తూ, ఈ కథకు నెమ్మదిగా ప్రాణం పోస్తూ మేము లెక్కలేనన్ని పగళ్లు, రాత్రులు కలిసి గడిపాము. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, తెర వెనుక శ్రమించిన అద్భుతమైన వ్యక్తులకు నా ధన్యవాదాలు. మీ నమ్మకం, సహనం, కృషి ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి" అని పేర్కొన్నారు. ఇక హిందీ ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పోలిస్తే, ఈ హిందీ చిత్రం ముగింపులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇది బాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని అన్నారు.

Next Story