Ajay Devgn: స్టార్ హీరో సినిమా వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్ట్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్’ 2012లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Ajay Devgn: స్టార్ హీరో సినిమా వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్’ 2012లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్-2’ తెరకెక్కుతుండగా.. ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, అజయ్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సంజయ్ దత్, సాహిల్ మెహతా, సంజయ్ మిశ్రా, రవికృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య జులై 25న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వగా.. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు అజయ్ దేవగన్. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ‘సన్నాఫ్ సర్దార్-2’ చిత్రం ఆగస్టు 1వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్


Next Story