- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
aishwaryarajesh: ‘మొదటిసారి ప్రయత్నించాను.. కానీ ఈ అనుభవం విలువైనది’.. నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్
సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు సినిమాలతో పాటు, తమిళ, మలయాళం సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది.
ఐశ్వర్య ముఖ్యంగా తెలుగులో భారీగా అవకాశాలు దక్కించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఐశ్వర్య అద్భుతమైన నటనకు ఇప్పటికే నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక కౌస్య కృష్ణమూర్తి, ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనాల్లో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్.. అలాగే మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రలో నటించారు. వెంకటేష్‌కు భార్యగా ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. ఇదంతా పక్కన పెడితే... ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. వృత్తిపర, వ్యక్తిగత విషయాల్ని పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
తాజాగా ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ నటి హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రెస్టారెంట్‌లో గోల్డెన్ కాఫీ తాగుతోన్న వీడియో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘మొదటిసారి గోల్డెన్ కాపుచినో ప్రయత్నించాను. అది బాగుంది కానీ చాలా ఖరీదైనది. కానీ అనుభవం విలువైనది. ధన్యవాదాలు @gtholidays.inనాకు ఇష్టమైన ప్రయాణ భాగస్వామి’’ అంటూ ఐశ్వర్య రాజేష్ రాసుకొచ్చింది.






