- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mega Star : చిరంజీవికి జోడీగా ఐశ్వర్యరాయ్ ?
చిరంజీవి, దర్శకుడు బాబీతో సినిమా చేయనున్నారు. ఇందులో ఐశ్వర్య రాయ్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఆమెను అతిథి పాత్ర కోసం తీసుకుంటున్నారా? లేక మెయిన్ హీరోయిన్ ఆమెనా? అనే సందేహాలు మొదలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సందడి చేయనున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేయనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా రాగా, ఇప్పుడు మరొకటి రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాయ్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఆమెను అతిథి పాత్ర కోసం తీసుకుంటున్నారా? లేక మెయిన్ హీరోయిన్ ఆమెనా? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ మొత్తానికి అయిత ఐశ్వర్య రాయ్ పేరును మాత్రం ఈ సినిమా కోసం పరిశీలిస్తోందట చిత్ర బృందం. అన్ని ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో డాడీ సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు ఐశ్వర్య రాయ్.






