కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్..ఫోటోలు వైర‌ల్

by velandi.Saikiran |

కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Aishwarya Rai Bachchan attends the Histoires De La Nuit screening at Cannes 2026
X

Aishwarya Rai Bachchan attends the Histoires De La Nuit screening at Cannes 2026

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని దున్నేసిన ఈ అందాల తార, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ... ఫ్యామిలీతోనే సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే అలాంటి ఐశ్వర్య రాయ్ తాజాగా కేన్స్ లో మెరిశారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పైన ఐశ్వర్య రాయ్ కనిపించి సందడి చేశారు.

జలకన్య థీమ్ తో అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన బ్లూ గౌన్ లో ఆమె కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక 2002 నుంచి ప్రతి సంవత్సరం కేన్స్ వేదికపై ఐశ్వర్య రాయ్ తన ఎలిగెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఐశ్వర్య హాజరు కావడం లేదని మొదట ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆమె ఎంట్రీ ఇచ్చి అందరికీ ట్రీట్ ఇచ్చారు.

Next Story