AIR: ఎంటర్‌టైనింగ్ & ఎమోషనల్‌గా AIR ట్రైలర్

by Chukka Sudharani |

‘కోర్టు’ ఫేమ్ హర్ష రోషన్ (Harsh Roshan) నటిస్తున్న లేటెస్ట్ యూత్ ఫుల్ వెబ్‌సిరీస్ ‘AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్’.

AIR: ఎంటర్‌టైనింగ్ & ఎమోషనల్‌గా AIR ట్రైలర్
X

దిశ, సినిమా: ‘కోర్టు’ ఫేమ్ హర్ష రోషన్ (Harsh Roshan) నటిస్తున్న లేటెస్ట్ యూత్ ఫుల్ వెబ్‌సిరీస్ ‘AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్’. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో భాను ప్రకాశ్, జరతీర్థ, హర్ష చెముడు, రమణ భార్గవ్, చైతన్యరావు, జీవన్ కుమార్, సందీప్ రాజ్, సునీల్, అక్షర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు చిత్ర బృందం.

‘ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ కోచింగ్ అనగానే వినిపించేది రెండే రెండూ కాలేజీల పేర్లు.. ఇక నుంచి గాలి కంటే వేగంగా.. గాలిలో భాగంగా వినిపించాల్సిన ఒకే ఒక్క పేరు’ అని సునీల్ సీరియస్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ మొత్తం కోచింగ్, ర్యాకింగ్ చుట్టూనే తిరుగుతోంది. ఇందులో హర్ష రోషన్ లవ్ స్టోరీ అలాగే.. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టే టార్చర్ తట్టుకోలేక ‘నేను పోతాను సర్.. నేను పోతాను నాకు ఈ కాలేజీ వద్దు నన్ను పంపించేయండి’ అంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫైనల్‌గా AIR ట్రైలర్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. లింక్


Next Story