‘పెద్ది’ షూటింగ్ తర్వాత నొప్పితో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-21 10:45:04  IST  )

ఇసుకలో, ఎండలో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించలేదా అని అడగ్గా.. చరణ్ ఊహించని సమాధాన మిచ్చారు. తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని.. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదని చెప్పారు.

‘పెద్ది’ షూటింగ్ తర్వాత నొప్పితో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని చిత్రబృందం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా, బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ కారులో ప్రయాణిస్తూ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. రెజ్లర్లతో సీన్ల గురించి చెప్తూ.. ఇసుకలో, ఎండలో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించలేదా అని అడగ్గా.. చరణ్ ఊహించని సమాధాన మిచ్చారు. తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని.. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదని చెప్పారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో తన కూతురిని కూడా ఎత్తుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారు.. వాళ్లు రియల్‌గా ఆడేస్తున్నారని తెలిపాడు. ఆడి తర్వాత సారీ చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్టోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని.. అలాంటి వారిని యాక్టింగ్ చేయమంటే అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. అయితే ‘పెద్ది’ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ నటించడం విశేషం.

Next Story