Adivi Sesh: అడివి శేష్ ‘డెకాయిట్’ ఫైర్ థీమ్ రిలీజ్..

by Chukka Sudharani |

అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’.

Adivi Sesh: అడివి శేష్ ‘డెకాయిట్’ ఫైర్ థీమ్ రిలీజ్..
X

దిశ, సినిమా: అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా.. ఇటీవలే ‘డెకాయిట్’ నంచి విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్‌తో అదిరిపోయింది.

నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్‌గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఫైర్ థీమ్‌ని పవర్ ఫుల్‌గా కంపోజ్ చేశారు. ఇది ఆడియన్స్‌కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. దీంతో ప్రజెంట్ ఈ ఫైర్ థీమ్ అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఈ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది.

Next Story