బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ ఆ స్టార్ హీరోతో ఉన్న ఫొటో షేర్ చేసిన అడివి శేష్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-12 09:22:28  IST  )

టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు అందించడంలో హీరో అడివి శేష్ ముందుంటాడు.

బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ ఆ స్టార్ హీరోతో ఉన్న ఫొటో షేర్ చేసిన అడివి శేష్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు అందించడంలో హీరో అడివి శేష్ ముందుంటాడు. ప్రతి సినిమాకు ఎంతో కేర్ తీసుకుని, వెరైటీ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడం వల్లనే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన గూఢచారి 2 (Goodachari 2) , డెకాయిట్ వంటి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. అడివి శేష్ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన ఎక్స్(X) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. స్టార్ హీరో నానితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్’ అని రాసుకొచ్చాడు. కాగా వీరిద్దరి కలిసి రీసెంట్‌గా హిట్-3 మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అయితే నాని హీరోగా నటిస్తే అడివి శేష్ మాత్రం కామియో రోల్ ప్లే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story