G2 : మీరంత వేచి ఉండలేదు.. వైల్డ్ ఫోస్టర్‌తో G2 రిలీజ్ డేట్ అనౌన్స్

by Chukka Sudharani |

అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నలిచిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి.

G2 : మీరంత వేచి ఉండలేదు.. వైల్డ్ ఫోస్టర్‌తో G2 రిలీజ్ డేట్ అనౌన్స్
X

దిశ, సినిమా: అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నలిచిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి. శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ మూవీ చిన్న సినిమాగా థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 2018లో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా గూఢచారి-2 (Goodachari2) రాబోతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో అడివి శేష్ హీరో కాగా.. ఇమ్రాన్ హష్మి, మధు శాలిని, వామికా గబ్బి, సుప్రియ యార్లగడ్డ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకు గూఢచారికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు చిత్ర బృందం. ఈ మేరకు ఇమ్రాన్ హష్మి ఈ సినిమా మే1, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లు తెలుపుతూ.. ‘ఇది నా అత్యంత సవాలుతో కూడిన యాక్షన్ పాత్ర. వచ్చే వేసవిలో మీరందరూ దీన్ని చూడటానికి వేచి ఉండలేను. G2 ప్రపంచవ్యాప్తంగా మే 1, 2026న విడుదల కాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో అడివి శేష్ అండ్ ఇమ్రాన్ హష్మి వైల్డ్ లుక్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటున్నది. లింక్


Next Story