అది నేను కాదు జాగ్రత్తగా ఉండండి.. ఫోన్ నంబర్ రివీల్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన అదితీ రావు హైదరీ

by Chukka Sudharani |

తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీ..

అది నేను కాదు జాగ్రత్తగా ఉండండి.. ఫోన్ నంబర్ రివీల్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన అదితీ రావు హైదరీ
X

దిశ, సినిమా: తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీ.. ఇటీవల హీరో సిద్ధార్థ్‌ను ప్రేమ వివాహం చేసుకుని ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఆమె పేరుతో ఓ వ్యక్తి పలువురు ఫొటోగ్రాఫర్స్‌ని మోసం చేస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండండి అంటూ తన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘అందరికీ నమస్కారం.. ఈరోజు కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.

ఎవరో నాలా నటిస్తూ వాట్సాప్‌లో నా ఫోటోలను ఉపయోగించి.. ఫొటోగ్రాఫర్‌లకు "ఫొటోషూట్‌ల" గురించి సందేశం పంపుతున్నారు. అది నేను కాదు. నేను అలా మెసేజులు చెయ్యను. అలాగే పని కోసం నాకు ఏ వ్యక్తిగత నంబర్ లేదు.. ప్రతిదీ ఎల్లప్పుడూ నా టీమ్ ద్వారానే నేను సంప్రదిస్తాను. కాబట్టి ఆ నంబర్ నుంచి మెసేజులు వస్తే స్పందించొద్దు. దయచేసి జాగ్రత్తగా ఉండండి.. అలాగే ఆ నంబర్‌తో కమ్యూనికేట్ అవ్వకండి.. నాకు అండగా నిలిచి, ఎంతో నాపై ప్రేమ చూపిస్తున్న అందరికి ధన్యవాదాలు’ అని తెలిపింది. అలాగే ఆ ఫేక్ నంబర్ (9150189055)ను కూడా పంచుకుంది అదితి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతున్నది. లింక్

Next Story