- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aditiraohydari: పింక్ కలర్ శారీలో అదరహో అనిపిస్తోన్న బ్యూటిపుల్ నటి.. స్టన్నింగ్ లుక్ వైరల్
మలయాళ చిత్రం ప్రజాపతితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అదితిరావు హైదరీ (Aditi Rao Hydari).

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ చిత్రం ప్రజాపతితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అదితిరావు హైదరీ (Aditi Rao Hydari). మొదటి సినిమానే స్టార్ హీరో ముమ్మట్టి సరసన అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ. దేవదాసీ పాత్రలో నటించి.. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. తర్వాత సుధీర్ మిశ్రా దర్శకత్వంలో యే సాలీ జిందగీ మూవీలో నటించి మెప్పించింది. ఈ మూవీలో అదితిరావు హైదరీ అద్భుతమైన నటనకు స్క్రీన్ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి అవార్డు సొంతం చేసుకుంది.
తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఈమె నటించి రాక్ స్టార్, మర్డర్ 3, ఖూబ్ సూరత్, ఫితూర్, వాజిర్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. శృంగారం, ఢిల్లీ 6, ధోబీ ఘాట్, యే సాలి జిందగీ,రాక్‌స్టార్,లండన్, పారిస్, న్యూయార్క్, బాస్, గుడ్డు రంగీలా,ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా, కాట్రు వెలియిడై, పద్మావత్, సమ్మోహనం, చెక్క చివంత వానం, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, సూఫియుం సుజాతయుమ్, సర్దార్ కా గ్రాండ్ సన్, మహా సముద్రం, హే సినామికా, సైకో వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుని మెప్పించింది.
ఇక ఈ బ్యూటీ సిద్ధార్థ్ తో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి.. వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే ఓ వైపు సినిమాల్లో రాణిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా అదితి పింక్ కలర్ కట్టుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






