- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఇగో రాజా'గా ఆది సాయికుమార్
ఆది సాయికుమార్ ప్రస్తుతం ఇగో రాజా చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆది సాయికుమార్ 'ప్రేమ కావాలి' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆది నటించిన 'లవ్ లీ' కూడా విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు సక్సెస్లను అందుకున్న ఈయనకు కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాతే ఈ యంగ్ హీరోకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. లవ్ లీ తర్వాత అనేక సంవత్సరాల పాటు ఈ నటుడు చాలా ఫ్లాప్స్ అందుకున్నాడు. దాంతో ఈయన సినిమా వచ్చిందో, పోయిందో కూడా చాలామందికి తెలియలేదు.
అలా ఎంతో డౌన్ ఫాల్లో కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ హీరో నుండి శంభాల అనే చిత్రం వచ్చింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆది మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. శంబాల లాంటి హిట్ తర్వాత ఆది కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా 'ఇగో రాజా' అనే చిత్రాన్ని తాజాగా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. అందులో ఆది పవర్ ఫుల్ మాస్ లుక్లో లుంగీ కట్టుకొని, నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్నాడు. ఆయన చుట్టూ రౌడీలు గుమిగూడారు, ఈ పోస్టర్ను బట్టి చూస్తే ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. గురు శరవరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో ఆది తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.






