‘సైరాబాను’గా ఆది సాయి కుమార్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త చిత్రం

by Pulgam srinivas |

‘సైరాబాను’గా ఆది సాయి కుమార్.. ఫణికృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించబోతున్నట్లు సమాచారం.

‘సైరాబాను’గా ఆది సాయి కుమార్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త చిత్రం
X

దిశ, వెబ్ డెస్క్: హీరో ఆది సాయి కుమార్ ఇటీవల ‘శంబాల’ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ముందు వరుసగా వచ్చిన ఫ్లాప్స్ కారణంగా కొంతకాలం ఆది సాయికుమార్ కెరీర్‌ కాస్త డౌన్‌లో సాగింది. ఇక ‘శంబాల’ సక్సెస్‌తో ఈ నటుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ యంగ్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఫణి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుందని ఓ వార్త టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం. అదేవిధంగా, ఈ సినిమాకు ‘సైరాబాను’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మరో రెండు నుంచి మూడు రోజుల్లో వెలువడే అవకాశముందని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ‘శంబాల’ విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్న ఆది సాయి కుమార్, ‘సైరాబాను’తో కూడా మరో హిట్‌ను అందుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story