- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అఖండ 2’ తాండవమే..
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో

దిశ, సినిమా : గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో, ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు విలక్షణ నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్పిన సంగతులివే..
బోయపాటి శ్రీను గారితో రెండో సారి పని చేస్తున్నారు కదా? ఏం తేడా గమనించారు?
బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను ‘సరైనోడు’ చిత్రంలో వైరం ధనుష్ అనే పాత్రను పోషించాను. అందులోని పాత్రకి ‘అఖండ 2’లో నేను పోషించిన కారెక్టర్‌కు చాలా తేడా ఉంటుంది. ఇలాంటి పాత్రను పోషించడం నాకు కూడా కొత్తే. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని నేను కూడా ఎదురుచూస్తున్నాను. మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్రలు నేను చేయలేదు.
‘అఖండ 2’ కథను బోయపాటి గారు మీకు ఎప్పుడు చెప్పారు?
మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్రలు నేను చేయలేదు. నేను కథ వినకుండా ఓకే చేసిన మొదటి చిత్రం ‘అఖండ 2’. బోయపాటి గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన సత్తా ఏంటో నాకు తెలుసు. బాలయ్య గారికి ఎదురుగా అంటే సరిపోతానా? అని అడిగాను. పర్‌ఫెక్ట్‌గా ఉంటారు అని ఆయన అన్నారు. సెట్‌కి వెళ్లిన తరువాతే నాకు ఆ వాతావరణం, కథ తెలిసింది.
‘అఖండ 2’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
బోయపాటి గారు నా పాత్రను వివరించిన తరువాత చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. వైరం ధనుష్ లాంటి పాత్రలు అయితే సొంతంగా ఊహించుకుని చేసుకోవచ్చు. కానీ ఇందులో పోషించిన పాత్ర మాత్రం నాకు ఓ ప్రయోగం లాంటిదే. ఇందులోని ప్రతీ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆడియెన్స్ ఎలా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
బోయపాటి గారు మీకు ఏమైనా రిఫరెన్స్‌లు ఇచ్చారా?
బోయపాటి గారు నాకు ముందే కొన్ని రిఫరెన్స్‌లు ఇచ్చారు. ఇలానే ఉండాలి.. ఇలానే కనిపించాలి.. ఇలానే ప్రవర్తించాలి అని ఆయన ముందే చెప్పారు. చాలా లుక్ టెస్ట్‌ల తరువాత ఫైనల్‌గా ఇప్పుడు సినిమాలో మీరు చూస్తున్న లుక్ ఫైనల్ అయింది.
బాలయ్య గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
బాలయ్య గారి గురించి బయట చాలా వింటుంటాం. కానీ సెట్‌లో ఆయన ఎనర్జీ వేరేలా ఉంటుంది. ఆయన ఉంటే సెట్‌లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. మా నాన్న గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ని కూడా నాతో పంచుకున్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆయనకు ప్రతి నాయకుడిగా నేను సరిపోతానా? అని అడిగాను. కానీ నన్ను బోయపాటి గారు నమ్మారు.
‘అఖండ 2’లో ఎలాంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి? ఏ మూమెంట్స్‌కి ఆడియెన్స్ ఎగ్జైట్ అవుతారు?
‘అఖండ’ కంటే ‘అఖండ తాండవం’లో హై మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బాలయ్య యాక్షన్, బోయపాటి మేకింగ్, తమన్ మ్యూజిక్, ఎలివేషన్స్‌ని చూస్తే పదివేల వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. వావ్ అనిపించేలా, ఆశ్చర్యపోయేలా ఎన్నో అంశాల్ని చూపించబోతోన్నారు. అదే ‘అఖండ 2’ ప్లస్ పాయింట్.
తమన్ సంగీతం, నేపథ్య సంగీతం గురించి చెప్పండి?
తమన్ మామూలుగా కొడితేనే బాక్సులు బద్దలు అవుతుంటాయి. ఇక బాలయ్య గారు తమన్ ఏ రేంజ్‌లో కొడతారో చెప్పాల్సిన పని లేదు. నా సీన్లకు కూడా ఈ సారి మ్యూజిక్ అదిరిపోతుంది. తమన్ తన ఆర్ఆర్‌తో అదరగొట్టబోతోన్నారు. నేను కూడా స్క్రీన్ మీద ఆ మ్యాజిక్‌ను చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.






