- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్స్‌స్టెంట్ హిట్‌గా ‘అద్దిరా లెక్క’
స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’.

దిశ, సినిమా: స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’. ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో నుంచి విడుదలైన పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘అద్దిరా స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’.లెక్క’ సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌లో జివి ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్స్ అన్నీ కలిసి సాంగ్‌ను మరింత ఎంటర్టైనింగ్‌గా మార్చాయి.
అంతే కాకుండా రిలీజ్ అయిన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, ఇన్స్‌స్టెంట్ హిట్‌గా మారింది. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించిన ‘హ్యాపీ రాజ్’ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్‌ను తాజాగా స్టార్ హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఈ ట్రైలర్ నెట్టింట పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది.






