Adavi Sesh: డెకాయిట్ ట్రైలర్‌లో మహేష్ ప్రస్తావన… అసలు కారణం ఇదే

by Pulgam srinivas |

అడవి శేష్ మాట్లాడుతూ… మహేష్ గారు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని, కానీ ఈ సినిమాలో ఒక సందర్భం వల్లే ఆ డైలాగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Adavi Sesh: డెకాయిట్ ట్రైలర్‌లో మహేష్ ప్రస్తావన… అసలు కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు అడవి శేష్ హీరోగా రూపొందిన 'డెకాయిట్' చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రస్తుతం దీనికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో ఒకచోట అడవి శేష్ చెప్పిన "అందరూ మహేష్ బాబులు అయిపోదామనే" అనే డైలాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ సినిమాలో మహేష్ బాబు గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే ప్రశ్న శేష్‌కు ఎదురైంది. దీనికి సమాధానం చెబుతూ... మహేష్ బాబు గారు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు.

ఈ సినిమాలో ఆ డైలాగ్ రావడానికి కారణం ఆయన 'మేజర్' సినిమా నిర్మాత కావడం కాదని, తాను యూఎస్‌లో ఉన్న సమయంలో మురారి సినిమా చూడటానికి రెండు గంటలు ప్రయాణించే వాడినని, మహేష్ బాబు గారిపై తనకు చిన్న సెంటిమెంట్ ఉందని శేష్ వెల్లడించాడు. మనం బయట కూడా సరదాగా "ఏంట్రా చిరంజీవిలా ఫీల్ అయిపోతున్నావు, మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నావు" అని అంటుంటామని, అలాంటి సందర్భం నుంచి వచ్చిన డైలాగ్ మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరియు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి షానైల్ డియో దర్శకత్వం వహించగా, సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

Next Story