- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adavi sesh: రాజమౌళి సూపర్.. ఆ విషయం హీరోలకు కూడా తెలియకుండా చేశాడు
రాజమౌళి గారు టైటిల్‌ను ముందుగానే చెప్పడంలో గ్రేట్. అలాగే దాన్ని హోల్డ్‌లో పెట్టి కూడా జనాలను ఇంపాక్ట్ చేయగలరని శేష్ చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయనకు, “మీరు మరియు రాజమౌళి దాదాపు ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు. టైటిల్స్‌ను పెద్దగా హోల్డ్‌లో పెట్టకుండా చాలా తొందరగా రివీల్ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో మీరు చాలా గ్రేట్” అనే ప్రశంసలు వచ్చాయి. దీనికి స్పందించిన అడవి శేష్, “అవును, రాజమౌళి గారు టైటిల్‌ను ముందే విడుదల చేయడంలో గ్రేట్. అలాగే టైటిల్‌ను హోల్డ్‌లో పెట్టి కూడా జనాలను ఇంపాక్ట్ చేయగలరు. ఉదాహరణకు RRR సినిమా మొదలు కావడానికి ముందు వర్కింగ్ టైటిల్‌గా ఆ పేరును పెట్టారు. అది జనాల్లోకి విపరీతంగా వెళ్లడంతో దానినే ఖరారు చేశారు. ఆ తర్వాత కూడా దాని అసలు మీనింగ్ ఎవరికీ పెద్దగా గుర్తు ఉండదు. ఆఖరికి హీరోలు, మూవీ యూనిట్ కూడా ఆ విషయాన్ని మరిచిపోయి ఉంటుంది. చాలామంది ఇప్పటికీ దాన్ని ‘త్రిపుల్ ఆర్’ అని అంటుంటారు. మన ఇండియన్స్ దాన్ని ‘త్రిపుల్ ఆర్’ అని అనినా, ఫారెన్ కంట్రీల్లో మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ అని అంటుంటారు. అంతలా ఆయన ఇంపాక్ట్ చూపించారు” అని శేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ నటుడు నటించిన ‘డెకాయిట్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.






