గుక్కతిప్పుకోకుండా హనుమాన్ చాలీసా పఠించిన హీరోయిన్

by velandi.Saikiran |

గుక్కతిప్పుకోకుండా హనుమాన్ చాలీసా పఠించిన హీరోయిన్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008 సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అదా శర్మ, ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ అటాక్ సినిమాలో హయాతి పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి ఎన్నో సినిమాలు చేసింది అదా శర్మ. అయితే ఆమె తాజాగా హనుమాన్ చాలీసా ( Hanuman Chalisa) ప‌ఠించి అందరినీ ఆకట్టుకుంది.

ఆంజనేయుడి జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పఠించింది హీరోయిన్ అదా శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అటు అదా శర్మ పక్కన ఉన్న బాలుడు నోటితో మ్యూజిక్ ఇచ్చాడు. అదే సమయంలో బ్రీత్ లెస్ చాలీసాను హీరోయిన్ అదా శర్మ చదవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. తమ ప్రయత్నం హనుమంతుడని మెప్పిస్తుందని అనుకుంటున్నట్లు అదా శర్మ పేర్కొన్నారు. కాగా తెలుగులో అరడజ‌న్ కు పైగా సినిమాలు చేసిన అదా శర్మ ది కేరళ స్టోరీ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా చాలా వివాదాలకు కేరాఫ్ అడ్ర‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.

Next Story