Adah Sharma: దేశంలో సగం మంది నన్ను చంపాలని చూశారు.. షాకింగ్ విషయం రివీల్ చేసిన హీరోయిన్

by Chukka Sudharani |   (  Updated:2025-11-13 09:32:15  IST  )

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ఢిపరెంట్ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అదా శర్మ.

Adah Sharma: దేశంలో సగం మంది నన్ను చంపాలని చూశారు.. షాకింగ్ విషయం రివీల్ చేసిన హీరోయిన్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ఢిపరెంట్ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అదా శర్మ. ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ... ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ వంటి సినిమాలతో సంచలనం సృష్టించింది. ఇక 2023లో వచ్చిన ది కేరళ స్టోరీ అయితే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు, విమర్శలకు దారి తీసింది. ఈ సినిమాతో అదాకు ఫుల్ క్రేజ్ రావడంతో పాటు.. విమర్శలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. ఇప్పటికే వీటి గురించి పలు ఇంటర్వ్యూలో తెలిపిన ఈ అమ్మడు.. తాజాగా మరోసాకి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

‘నేను ఎప్పుడు సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకుంటాను. ఎమోషనల్ కంటెంట్ లేకపోయిన, స్క్రిప్ట్ స్ట్రాంగ్‌గా లేకపోయిన నాకు ఆసక్తి ఉండదు. యాక్షన్ సన్నివేశాలతో పాటు.. కొన్ని లీటర్ల నీళ్లు తాగి ఏడ్చి నన్ను నేను డీహైడ్రేట్ చేసుకునే అవకాశం ఉండే రోల్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు చేసినప్పుడు కొన్ని సార్లు నా ఫ్యామిలీ ఫీల్ అవుతారు కానీ., ఫైనల్‌గా సంతోషిస్తారు. అందుకే నా మొదటి చిత్రం ‘1920’నుంచి నేను ధైర్యమైన కథలు ఎంచుకుంటున్నాను. రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు విలువ పెరుగుతుంది. అయితే.. ది కేరళ స్టోరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు దేశంలో సగం మంది నన్ను చంపాలని చూశారు. కానీ మిగతా సగం మంది మాత్రం నన్ను రక్షించారు. నాపై ప్రేమను కునిపించారు. ఇక ఆ తర్వాత చేసిన బస్తర్: ది నక్సల్ స్టోరీ టైమ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే నాకు ఎదురయ్యాయి.

Next Story