నా జీవితం ఇక సాయిబాబాకు అంకితం.. టాలీవుడ్ నటి కీలక ప్రకటన

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ నటి తులసి యాక్టింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి శంకరాభరణం సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

నా జీవితం ఇక సాయిబాబాకు అంకితం.. టాలీవుడ్ నటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి తులసి యాక్టింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి శంకరాభరణం సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం 4వ ఏట నుండే నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. ఆ తరవాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ఎక్కువగా తల్లి, అత్త లాంటి క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులను అలరించారు.

ప్రభాస్ హీరోగా వచ్చిన డార్లింగ్ సినిమాలో తులసి తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్, తులసి మధ్య అనుబంధం నిజమైన తల్లికొడుకుల మధ్య ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అమాయకంగా కనిపిస్తూనే నవ్విస్తూ తులసి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటారు. తులసి తల్లి నటి సావిత్రికి స్నేహితురాలు కావడంతో జీవనతరంగాలు సినిమాలోనూ ఉయ్యాలలో పసిపాప పాత్రలో నటించారు. ఇక తులసి కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకోగా కొంతకాలం పాటు నటనకు దూరం అయ్యారు. తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలు చేశారు.

Next Story