- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9 మంది హిందూ దేవతల శక్తి అంటూ కూతురి పేరును రివీల్ చేసిన నటి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటి మసాబా గుప్తా(Masaba Gupta), నీనా గుప్తా(Neena Gupta) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి పలు వెబ్‌సిరీస్‌లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మసాబా గుప్తా(Masaba Gupta), నీనా గుప్తా(Neena Gupta) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి పలు వెబ్‌సిరీస్‌లో నటించి మెప్పించింది. 2023లో ఆమె సత్యదీప్ మిశ్రా(Satyadeep Mishra)ను రెండో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది ఆమె ఏప్రిల్ 18న గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా(Social Media) ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలను పంచుకుంది. ఇక 2024లో అక్టోబర్ 10న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తాజాగా, తన కూతురు పేరును రివీల్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్శించింది. ‘‘నా ముద్దుల కూతురు మాతార(Matara)కు అప్పుడే 3 నెలలు అవుతుంది. తన పేరు ఏకంగా 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. నా కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మా కళ్లకు నక్షత్రం లాంటిది’’ అని రాసుకొచ్చింది. అలాగే ఇద్దరి చేతులను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారు గార్జియస్, నైస్ నేమ్ అని కామెంట్లు పెడుతున్నారు.






