ధురంధర్ పై రేణు దేశాయ్ రివ్యూ.. వారి గురించి కాస్త ఘాటుగానే..

by Naga Rani Yarlagadda |

బాలీవుడ్‌లో ఇప్పుడు అతి పెద్ద హాట్ టాపిక్ “ధురంధర్”. రణ్‌వీర్ సింగ్ లైఫ్‌టైమ్ పర్ఫార్మెన్స్..

ధురంధర్ పై రేణు దేశాయ్ రివ్యూ.. వారి గురించి కాస్త ఘాటుగానే..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో ఇప్పుడు అతి పెద్ద హాట్ టాపిక్ “ధురంధర్”. రణ్‌వీర్ సింగ్ లైఫ్‌టైమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ చిత్రం థియేటర్లలో భారీ స్పందన తెచ్చుకుంటోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దేశభక్తి, ఎమోషన్, ధైర్యం… ఇలా అన్ని రకాలుగా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై స్పందించిన ప్రముఖ నటి రేణు దేశాయ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

“ధురంధర్ ప్రతి ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా. దర్శకుడు ఆదిత్య ధర్ ఒక బ్రిలియంట్ మాస్టర్‌పీస్ ఇచ్చాడు. మనల్ని రోజూ క్షేమంగా ఉంచడానికి భారత సైన్యం, మన రక్షణ దళాలు 24×7 కష్టపడుతున్నారు. వాళ్ల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా, భద్రంగా ఉండగలుగుతున్నాం. ఈ సినిమా చూస్తే ఆ విషయం మరింత లోతుగా అర్థమవుతుంది. ఇకనైనా కొందరు ‘సూడో సెక్యులర్స్’ గా తయారై, దేశం మీద మాట్లాడే హక్కు లేదని నిరూపించుకుంటూ తిరిగే వాళ్లు ఈ సినిమా చూసి కనీసం కొంచెం అయినా దేశం పట్ల గౌరవం నేర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మన దేశం పక్షాన నిలబడాల్సిన సమయం ఇది.”రేణు దేశాయ్ ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆమె మాటలకు పూర్తి మద్దతు పలుకుతూ “చివరికి ఒక్కరైనా నిజం మాట్లాడారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు మాత్రం దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు.

Next Story