- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో పెళ్లిపై క్లారిటీ ఇస్తూ నటి పూనమ్ షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
బాలీవుడ్ నటి పూనమ్ పాండే(Poonam Pandey) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి పూనమ్ పాండే(Poonam Pandey) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఆమె సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ పాండే తన పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఆమెకు సంబంధించిన వార్తలు.. పెట్టే పోస్టులు నిమిషాల్లో వైరల్ అవుతాయి.
అయితే 2011లో వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలోనే నగ్నంగా తిరుగుతానని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అంతేకాకుండా ఇటీవల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏకంగా తను చనిపోయినట్లుగా పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత అవగాహన కోసమే అలా చేయాల్సి వచ్చిందని తెలపడంతో అంతా విమర్శలు చేశారు. ఇక ఇటీవల పూనమ్‌తో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ముద్దు పెట్టేందుకు ట్రై చేయగా.. తెలివిగా అతడి నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇప్పటికే పెళ్లి చేసుకున్న పూనమ్ భర్తతో విడిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు రెండో పెళ్లి చేసుకోవడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘రెండేళ్లుగా ఒంటరిగానే ఉన్నాను. నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను. వైవాహిక జీవితం నాకు కలిసిరాదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడైతే హాయిగా ఉన్నాను. నాకు అందమైన కుటుంబం, మంచి కెరీర్ ఉంది. ఈ రెండింటితో నేను సంతృప్తిగా ఉంటున్నా. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఎవరిని నమ్ములకున్నాను కాబట్టి రెండో పెళ్లి ఆలోచన లేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






