- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది : మంచు లక్ష్మి
ఒక రోజున త్రిష పుట్టిన రోజు, TVK పార్టీ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు విజయ్. ముఖ్యమంత్రి పీఠంలో కూడా విజయ్ కూర్చుంటారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. నిన్న హీరోయిన్ త్రిష పుట్టిన రోజు. ఇదే రోజున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో హీరోయిన్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి.
త్రిష డబుల్ సెలబ్రేషన్స్ - మంచు లక్ష్మి
ఒక రోజున త్రిష పుట్టిన రోజు, TVK పార్టీ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. త్రిషకు ఇది అదిరిపోయే పుట్టిన రోజు కానుక.. విశ్వమే ఈ విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ రోజు నీకు డబుల్ సెలబ్రేషన్ అని త్రిషకు మంచు లక్ష్మి శుభాకాంక్షలు చెప్పడం వివాదాస్పదమైంది. కాగా విజయ్-హీరోయిన్ త్రిష ఇద్దరూ సీక్రెట్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ మంచు లక్ష్మి పోస్ట్ పెట్టారు. దీంతో వీళ్ళ రిలేషన్ రూమర్లకు మరింత బలం చేకూరింది.






